Jagan: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరిగింది..! 24 d ago
ఛత్తీస్‌గఢ్,ఒడిశా, తమిళనాడు కంటే ఏపీకి తక్కువ రేట్ కే విద్యుత్ వచ్చిందని జగన్ చెప్పారు. తక్కువ రేటుకు విద్యుత్ తీసుకువస్తే సన్మానించాల్సింది పోయి మాటలు అంటున్నారని అన్నారు. సంపద సృష్టి తాను చేస్తే బాబు ఆవిరి చేస్తున్నారని విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో లక్ష కోట్లు సంపద అవుతుందని జగన్ తెలిపారు. రూ.2.49 పైసలు విద్యుత్ సరఫరా ఒప్పందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిందని పేర్కొన్నారు.